ఇలా సినిమా ఫీల్డ్ లో చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఆర్.నారయణమూర్తి ఇంకా చాలామంది ఉన్నారు. మీకు ఇక ఎవరైనా తెలుసుంటే meespoorti@gmail.com కు తెలియచేయండి.
Saturday, September 15, 2007
సినీనటుడు రాజశేఖర్ మంచితనం...
సినీనటుడు రాజశేఖర్ గారి మంచితనం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయనది చాలా మంచి మనసు. మన రాష్ట్రంలో విపత్కర పరిస్దితులు సంభవించినప్పుడు తనకు తోచిన విరాళములను ఇచ్చి ఆదుకున్న సందర్భములు ఉన్నాయి. వాళ్ళ పాప 'శివాని' పుట్టినరోజున ప్రతీ సంవత్సరం అనాధ శరణాలయంనకు కుటుంబ సమేతముగా వెళ్ళి పిల్లలందరికీ బట్టలు,స్వీట్లు,పుస్తకాలు వంటివి వాళ్ళ పాప చేత పంచిపెట్టిస్తారు. ఇట్లా మనం చేసే మంచి పనులను మన పిల్లల చేతుల మీదుగా చేయిస్తే వాళ్ళలో మంచిగుణం అలవడుతుంది. ఆయనలో ఈ మంచి గుణమునకు ఆయన భార్య జీవిత కూడ సహకరించడం ఒక మంచి చెప్పుకోదగ్గ విషయం.
ఇలా సినిమా ఫీల్డ్ లో చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఆర్.నారయణమూర్తి ఇంకా చాలామంది ఉన్నారు. మీకు ఇక ఎవరైనా తెలుసుంటే meespoorti@gmail.com కు తెలియచేయండి.
ఇలా సినిమా ఫీల్డ్ లో చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఆర్.నారయణమూర్తి ఇంకా చాలామంది ఉన్నారు. మీకు ఇక ఎవరైనా తెలుసుంటే meespoorti@gmail.com కు తెలియచేయండి.
at 8:27 AM 3 comments Posted by spandana
Saturday, September 1, 2007
మా రమణమూర్తి ఔదార్యం - ఒక యువకుడికి మలేషియా జైలు విముక్తి
ఈ ఫోటోలో కనిపించేది మా మంచి రమణమూర్తి. వీడు అస్తమానూ ఇతరులకి సహాయం చేసే గొడవలలో తలదూరుస్తూంటాడు. వీడు ప్రస్తుతం ఉండేది కౌలాలంపూర్, మలేషియాలో. వీడు చేసిన అతి మంచి పనులలో ఒకటి నాకు నచ్చినది చెబుతాను. కొద్ది రోజుల ముందు తూర్పు గోదావరికి చెందిన ఒక యువకుడు పేరు రాజు ఇక్కడ కౌలాలంపూర్లో ఒకరితో అనవసరమైన గొడవపడి పోలీసులకి దొరికిపోయాడు. అతని దురదృష్టం అతను ఇల్లీగల్. అంటే అతని వీసా పేపర్లు సరైనవి కాదు. అతన్ని జైలులో పెట్టారు. ఈ మలేషియా జైళ్ళు నరక కూపాలు. 150 మందిని ఒకే సెల్లో ఉంచుతారు. వీళ్ళందరికీ ఒకే బాత్రూమ్-కం-లెట్రిన్ ఉంటుంది. అదెంత నరకమో ఆలోచించండి. ఇక ఆహారం సంగతి సరేసరి, దారుణమైన అన్నం పెడ్తారు. ఇది ఇండియాలో ఉన్న ఆ అబ్బాయి నాన్నగారికి తెలిసింది. వాళ్ళ ఇంట్లో ఆ తల్లితండ్రుల బాధ వర్ణనాతీతం. ఆ అబ్బాయి నాన్నగారు ఎలాగోలా వాళ్ళ పక్క ఊరికి చెందిన మా రమణమూర్తి మలేషియాలో ఉంటున్నట్టు తెలుసుకుని వీడి ఫోన్ నెం. సంపాదించి వీడికి ఫోన్ చేసి వివరాలు చెప్పి పుత్రభిక్ష పెట్టమని కన్నీరు మున్నీరుగా విలపించి విడిపించడానికి అయిన ఖర్చులంతా భరిస్తానని చెప్పారు. వాళ్ళకి తప్పకుండా ఆ అబ్బాయిని విడిపించి ఇండియాకు పంపుతానని మాట ఇచ్చి భయపడవద్దని ధైర్యం చెప్పాడు. కాని వీడికీ కొత్తనే, ఇలాంటి కేసులను ఎలా విడిపించాలో. ముందు ఆ అబ్బాయి ఎడ్రస్సు తెలుసుకుని, అతను చేసిన తప్పు తెలుసుకుని ఎలా ప్రొసీడ్ కావాలో మా స్నేహితులని అందర్నీ కనుక్కుని విడిపించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కొన్నిసార్లు ఆఫీసు సెలవు పెట్టి, కొన్నిసార్లు పర్మిషను పెట్టి ఆ రాజు అన్న అబ్బాయిని జైలులో కలసి అతనికి కావలసినవి కొని, తినడానికి కొని, అవసరమైనప్పుడు అతని సంతకాలు తీసుకుని పేపర్లు సబ్మిట్ చేసి కొద్దిరోజులకి అతన్ని ఇండియాకు పంపడానికి పర్మిషన్ తేవడంలో సఫలీకృతుడయ్యాడు. దీనికంతటికీ సుమారు నెల రోజులపైగా పట్టింది. ఈ నెల రోజులూ మా రమణమూర్తి ఓపిగ్గా అవసరమైనచోట్లకి, జైలుకి తిరిగాడు. పర్మిషన్ రాగానే ఇండియాకు టికెట్ తీసి జైలుకు తీసుకు వెళ్ళి ఇస్తే ఆనక వాళ్ళు అతన్ని కస్టడిలో ముందు ఎయిర్పోర్టుకు తర్వాత ఇండియాకు పంపారు. ఆ అబ్బాయి ఇండియా చేరాక వాళ్ళ ఇంట్లో పండగే పండగ. మేమంతా మా రమణమూర్తిని మెచ్చుకున్నాము.
at 10:26 AM 3 comments Posted by spandana
మా నాన్న గారి చదువు మమకారం ...
మాది తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు గ్రామం. మా నాన్న గారి పేరు సత్యనారాయణ మూర్తి. ఆయన రిటైర్ అయిన ఎలిమెంటరీ స్కూల్ మాష్టారు. ప్రస్తుతం ఆయనకు పెన్షన్ మాత్రమే ఆధారం. మా నాన్న గారు, మా అమ్మ గారి మందులకి, ఇంటి ఖర్చులకి ఆ డబ్బులు సరిపోవాలి. ముందు నుండీ మా నాన్న గారు ఎవరికైనా ఆర్ధికంగా సహాయం చెయ్యడం, చిన్న చిన్న దానధర్మాలు చెయ్యడం, బయట రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా ఆకలితో కనిపిస్తే హోటల్ కి తీసుకు వెళ్ళి భోజనం పెట్టిస్తూండడం చేస్తూ ఉంటారు. కాని ఈమద్య ఫోన్ చేసినప్పుడు ఒక మంచి విషయం చెప్పారు. అది ఆయన ఒక 9వ తరగతి పాసయిన పేద మెరిట్ స్టూడెంట్ ను తీసుకుని అతని 10వ తరగతి చదవడానికి కావలసిన అన్ని పుస్తకాలు,పెన్నులు, మొ. ఖర్చు అంతా భరిస్తున్నానని చెప్పారు. చాలా ఆనందమేసింది. గర్వంగా కూడా అనిపించింది. రిటైర్ అయినా కూడ ఆయినా ఇట్లాంటివి కొనసాగింపు నాకు స్ఫూర్తినిచ్చింది. మనలో ఇట్లాంటివారు చాలా మందే ఉంటారు. వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు అయిఉంటారు, ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి పనులని డబ్బా వాయించి చెప్పుకోరు. వాళ్ళు మీరే కావొచ్చు, మీ నాన్నగారు, మీ అమ్మగారు, అక్క, బావ గారు, స్నేహితులు, మీ ఇంటి పక్కన ఉండేవాళ్ళు, లేదా మీకు తెలుసున్నవాళ్ళు కావొచ్చు. వాళ్ళు చేసిన ఆ మంచి గొప్ప పని మీకు నిజంగా స్ఫూర్తినిస్తే దయచేసి మాకు తెలియచేయండి. మరింత మందికి అది తెలియచేసి కొందరికైనా స్ఫూర్తినిద్దాం.
at 9:14 AM 2 comments Posted by spandana
Subscribe to:
Posts (Atom)