సుస్వాగతం
మానవసేవే మాధవసేవ అనేది ఈ బ్లాగ్ కి స్ఫూర్తి
చేసిన పాపం చెబితే పోతుంది అంటారు పెద్దలు. చేసిన పుణ్యమూ అంతే... చెప్పుకుంటే పోతుంది,
కాని మనం చేసిన ఒక మంచి పని నలుగురికీ స్ఫూర్తిని ఇస్తుందంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో తప్పేమి ఉంటుంది.
అలా మనం చేసిన కొన్ని మంచి పనులని అందరికీ తెలియచేసి కొందరికైనా స్ఫూర్తినివ్వాలనే ఈ బ్లాగ్ ప్రారంభించడానికి ముఖ్యమైన కారణం.
దీనికోసం:
1)మీరొక పని మీద వేరొక ఊరు వచ్చి మండుటెండ లో ఒక హొటల్ నుండి భోజనం చేసి బయటకి వచ్చారు. అక్కడ ఒక ముదుసలి అవ్వ ఆకలితో మాడిపోతూ డబ్బుల కోసం అన్నం తినడానికి అడుక్కుంటోంది. ఆమెకు అన్నం పెట్టించండి, లేదా కనీసం టిఫిన్ ఐనా పెట్టించండి. ఆమె కళ్ళలో కృతజ్ఞతను చూడండి. మీ గుండె మీకేమి చెబుతుందో వినండి. ఆమె మీకెపుడూ ఆకలి కష్టం రాకూడదని తన నిండు మనసుతో దేవుడిని ప్రార్ధిస్తుంది.
2)మీకెప్పుడు కష్టమొచ్చినా దేవుడికి డబ్బులేస్తే మీ సమస్య తీరుతుందనుకోండి, కాని ఈసారి వెరైటీగా నాకీ సమస్య తీరితే ఒకరికి సాయం చేస్తా అని మొక్కుకోండి. తప్పకుండా మీ సమస్య తీరుతుంది.
3)మీ అదృష్టం బాగుండి మీరొక మంచి స్దితిలో ఉన్నారు, కాని ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అనుకోకండి. మనం ఒక పేదింటి బిడ్డకి సాయం చేస్తే రేపూ మన పిల్లలకి ఆపద వచ్చినప్పుడు అంతకు పది రెట్లుగా వేరెవరివల్లో సాయమందుతుంది.
4)జీవితంలో మీరెప్పుడో ఒకప్పుడు కనీసం ఎవరో ఒకరి సాయమైనా తీసుకోకుండా ఒక మంచి స్దితికి వచ్చి ఉండరు, ఒకసారి కళ్ళు మూసుకుని గుర్తుకు తెచ్చుకోండి. అలానే మీరూ చేతనైనంత సహాయం, తోడ్పాటు మీ నుండి అవసరమైన వారికి ఇవ్వండి. వారి జీవితంలో వెలుగు మీ గుండెల వరకూ పరుచుకుంటుంది.
5)మనం మన నెలవారీ ఖర్చుల కోసం ఒక బడ్జెట్ వేసుకుంటాము. అందులో కనీసం మన జీతంలో ఒక పర్సెంటైనా ఇతరుల కోసం దానానికి లేదా సాయానికి పక్కన పెట్టలేమా? మీరు 10,000 రూ. సంపాదిస్తున్నారు అనుకుందాము నెలకు. అంటే 100 రూ. ఎవరికైనా సాయం చెయ్యడానికి పక్కన పెడితే మీకు కష్టమౌతుందా?
6)ఒకరి ఆపరేషన్ కోసం లక్ష రూపాయిలు ఖర్చు అవుతుంది అనుకుందాము, అంతసాయం చెయ్యడం మీ స్దొమత వలన అవ్వదు. ఆగిపోకండి నావలన కాదని. ఒక వెయ్యి రూపాయిలు ఐతే మీకివ్వడానికి ఓకె అనుకోండి, మీరు అంతే ఇవ్వండి. కాని నలుగురికీ చెప్పి మిగిలిన ఎంతో కొంత ఇవ్వగలిగేలా చెయ్యండి. మీరివ్వలేకపోయినా మిగిలిన మీకందుబాటులో ఉన్నవారికి చెప్పండి. వారు తోడ్పడినా వారి పుణ్యంలో మీకూ భాగముంటుంది.
7)మీరు మీ ఊరు వచ్చినప్పుడు మీకు స్దోమత కలిగితే ఒక బాగా చదివే పేద విద్యార్ధి(ని)కి చదువుకోడానికి ఆర్ధికసాయం చెయ్యండి, చదువు చెప్పిస్తే జీవితాన్నిచ్చినట్టే.
8)మనకి కష్టం వచ్చినప్పుడు అనుకుంటాము దేవుడికైతే ఇంచక్కా కష్టాలు ఉండవుకదా అని. మీకూ దేవుడు అవ్వాలని ఉందా, కనీసం ఒకరితో ఐనా నిండు మనసుతో 'దేవుడిలా వచ్చి సాయం చేసావు' అనుపించుకోండి. మీరూ దేవుడు అయ్యారు కదా మీకూ కష్టాలు ఉండవు.
9)ఆఖరిగా మీకు కష్టమొచ్చి దేవుడి దగ్గరకు వెళ్ళి కష్టం నుండి గట్టెక్కించమని అడిగితే, ఇప్పటివరకూ నీ జీవితంలో నువ్వెవ్వరికైనా నిండు మనసుతో సహాయం చేసావా అని దేవుడు మిమ్మల్ని అడిగితే, మీ సమస్య దేవుడు తీర్చెంతగా మీ దగ్గర కనీసం ఒక బలమైన పుణ్యఫలం ఉందా?
అలా ఉంటే...
మీరు చేసిన ఆ మంచి పనులను పైన తెలియచేసిన మెయిల్-ఐడికి దయచేసి పంపండి. మా టీమ్ నిర్ణయించి ఈ బ్లాగ్ లో ఉంచుతాము. ఈ బ్లాగ్ దీనికి సంబంధించిన యాహూ గ్రూప్స్ కి, అందరి స్నేహితులకి తెలియచేయబడుతుంది. మీరు చేసిన మంచి పని కొందరికైనా స్ఫూర్తిగా నిలుస్తుంది.
సినీనటుడు రాజశేఖర్ గారి మంచితనం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయనది చాలా మంచి మనసు. మన రాష్ట్రంలో విపత్కర పరిస్దితులు సంభవించినప్పుడు తనకు తోచిన విరాళములను ఇచ్చి ఆదుకున్న సందర్భములు ఉన్నాయి. వాళ్ళ పాప 'శివాని' పుట్టినరోజున ప్రతీ సంవత్సరం అనాధ శరణాలయంనకు కుటుంబ సమేతముగా వెళ్ళి పిల్లలందరికీ బట్టలు,స్వీట్లు,పుస్తకాలు వంటివి వాళ్ళ పాప చేత పంచిపెట్టిస్తారు. ఇట్లా మనం చేసే మంచి పనులను మన పిల్లల చేతుల మీదుగా చేయిస్తే వాళ్ళలో మంచిగుణం అలవడుతుంది. ఆయనలో ఈ మంచి గుణమునకు ఆయన భార్య జీవిత కూడ సహకరించడం ఒక మంచి చెప్పుకోదగ్గ విషయం.
ఇలా సినిమా ఫీల్డ్ లో చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఆర్.నారయణమూర్తి ఇంకా చాలామంది ఉన్నారు. మీకు ఇక ఎవరైనా తెలుసుంటే
meespoorti@gmail.com కు తెలియచేయండి.
3 comments:
srihari,jr.N.T.R[education ki help cestunnaaru]
raja[free gaa edo hospital maintain cestunnaaru]
rajashekha garu chala mandi vikalangulaku weel chairs andistuntaru........... he is a real hero.
Nice Blog
It is useful for Everyone
DailyTweets
Thanks...
Post a Comment